This article is a firsthand account of the arduous journey that Adivasis of Andhra face in obtaining an Aadhaar card, detailing the bureaucratic challenges, extensive procedures, and infrastructural inadequacies that complicate the process and impose significant hardships on these communities. The article is written by our field ethnographers J. Kondababu, Laxman, and Mallesh.

 

కథ కాదు నిజం.

‘కల్పన కంటే నిజం విచిత్రంగా ఉంటుందని ఎవరో పెద్దాయన అన్నాడంట. ఇక్కడ మేం చెప్పబోయేది మాత్రం కథ కాదు, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న నిజం.

ఆధార్ కార్డు ఎవరైనా తీసుకోవాలంటే జనన ధ్రువపత్రం ఖచ్చితంగా ఉండాలని అది కూడా 10వ తరగతి సర్టిఫికెట్ లేదా సబ్ కలెక్టరు స్థాయి అధికారి ద్రువీకరించాలని నియమం వచ్చింది. కానీ జనన ధ్రువపత్రం పొందాలంటే మొదటిగా తల్లి తండ్రి ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డు ఉండవలెను. కానీ రేషన్ కార్డు కావాలంటే మాత్రం ఆధార్ కార్డు ఉండాలి. ఇదొక వలయం. భూమి గుండ్రంగా ఉన్నట్లు మీరు ఎక్కడికి పోయినా ఆధార్ కార్డు దగ్గరే తేలుతారు.
ఇక జనన ధ్రువపత్రం సంపాదించడానికి ఆదివాసీలు పడే పట్లు మా అనుభవం నుండి చూద్దాం.

ధ్రువపత్రం కావలసిన వ్యక్తి తన గ్రామం నుండి అంగన్వాడి టీచర్, ఆశా వర్కర్ దగ్గర నింపిన దరఖాస్తు మీద ఆశ వర్కర్, అంగన్వాడి వర్కర్ సంతకం తీసుకోవాలి. మరియు పంచాయతీ సర్పంచ్ సంతకం కూడా తీసుకోవాలి. వీళ్ళలో కొంతమంది చేతులు తడపమంటారు. ఆ తడిపిన చేతులు తడి ఆరకుండా సంతకం పెట్టించుకున్న దరఖాస్తును తీసుకువెళ్లి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కు (DA) సమర్పించాలి. మన ఏజెన్సీలో నెట్వర్క్ లేని సచివాలయల సిబ్బంది సాధారణంగా మండల కేంద్రం నుండో లేదా వాళ్ళ ఇంటి నుండో(చాలా సందర్భాలలో పాడేరు) పని చేస్తారు. మనం వాళ్ళను వెదుక్కుంటూ వెళ్లాల్సిందే.

ఇక DA ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తు DA నుండి VRO లాగిన్ లోకి వెళ్తుంది. అప్పుడిక విఆర్ఓ దరఖాస్తు పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని రెవెన్యూ ఇనస్పెక్టర్ లాగిన్ కు పంపిస్తారు. ఈ ప్రక్రియలో విఆర్ఓ గ్రామానికి వచ్చి తనిఖీ చేయడానికి వారికి నచ్చిన సమయం దొరికితే తప్ప.. ఆ పని ముందుకు సాగదు. అప్పుడు విఆర్ఓ R I లాగిన్ కి పంపిస్తారు.R I నుండి ఎమ్మార్వో.ఎమ్మార్వో నుండి ఆర్డీవోకు పంపిస్తారు. ఏ అధికారి వద్ద ఎన్ని రోజులు ఆలస్యం చేస్తున్నారో. ఎవరు లాగిన్ లో ఎన్ని రోజులు నిలిపి వేస్తారో తెలియదు. తెలుసుకోవడానికి గ్రామం నుండి సచివాలయం వరకు. రెండు మూడు వారాలు సమాచారం తెలుసుకోవడానికి తిరగవలసిన పరిస్థితి. గ్రామానికి సచివాలయానికి తిరగడానికి. సమయం వృధా మరియు వ్యవసాయ పనులు మానుకొని సమయాన్ని వృధా చేస్తూ 1000 నుండి 1500 రూపాయలురవాణా మరియు ఇతర నగదు ఖర్చు చేసి తిరిగినప్పటికీ కూడా జనన ధ్రువపత్రం చేతికి అందని పరిస్థితి. ఇన్ని అవస్థలుపడిన తర్వాత .. జనన ధ్రువపత్రం చేతికి అందుతుంది.

ఆధార్ కార్డు కొరకు ఆధార్ సెంటర్ కి ఆధార్ తీసుకోవాలంటే ఒక ఫారం నింపాల్సి ఉంటుంది.అలాగే ఆధార్ సెంటర్ కి వెళ్ళాలంటే సుదూర ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి. రోడ్ సౌకర్యం సరిగా లేకపోవడం. బస్సులు అలాగే ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులోలేకపోవడం. వలన మరియు తీరా ఆధార్ సెంటర్ కి వెళ్ళాక సర్వార్ పనిచేయడం లేదు.అని ఆధార్ నిర్వహకులు చెప్పడం ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆధార్ తీసినాక ఆధార్ కార్డు వస్తుందో లేదో తెలియకపోవడం. అలాగే ఆధార కార్డులు ఎక్కువసార్లు రిజెక్ట్ అవడం. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియకపోవడం. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినప్పటికీ పోస్ట్ మెన్ ఆధార్ కార్డు అందిస్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఎదుర్కోవడం. ఆధార్ నమోదు కొరకు కిలోమీటర్ల దూరంనుండి.. కొండలు దాటుకొని రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇక్కట్లు పడుతూ కొండల్లో నడక ప్రయాణం చేయడం.సమయం డబ్బులు మరియుశ్రమ వృధా చేసిన ఆధార్ వచ్చే పరిస్థితి లేకపోవడం.చాలా బాధాకరం. ఒకసారి ఆధార్ నమోదు చేసినా.ఆ ఆధార్ కార్డు నమోదయిందో లేక రిజెక్ట్ అయిందో తెలియని పరిస్థితి. ఒకవేళ రిజెక్ట్ అయిందంటే ఇక్కడ అవ్వదు.మైదాన ప్రాంతంలో వెళ్ళవలసి ఉంటుందని ఆధార్ నిర్వాహకులు చెప్పటం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మైదాన ప్రాంతమైన నర్సీపట్నం లేదా రోలుగుంటలో సుమారు 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పటికీ ఆధార్ సెంటరు తీసి ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాగా మైదాన ప్రాంతమైన నర్సీపట్నం రోలుగుంటలు వెళ్లినప్పటికీ ఆధార్ పూర్తిగా నమోదు అవుతుందో లేదో తెలియటం లేదు.

ఆరోజు గనక ఆధార్ నమోదు కాలేకపోతే ఆ రాత్రి అక్కడే బస్స ఉండి మరుసటి రోజు ఆధార్ నమోదు చేయించుకుని. మరలా తిరిగి ప్రయాణంలో ఆరోజు రాత్రి 11 లేదా 12 గంటలకు గ్రామంలో చేరుకోవడం జరుగుతుంది.ఇవి గిరిజన ఆదివాసులు పడుతున్న ఆధార్ కష్టాలని చెప్పవచ్చు. అలాగే గిరిజన గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకు రోడ్డు సౌకర్యం లేకపోవడం అలాగే ఫోను సిగ్నల్ అందుబాటు లేకపోవడం వల్ల ఆధార్ సెంటర్ ఎప్పుడు తీస్తారో సాంకేతిక లోపాలు వలన సమాచారం తెలియకపోవడం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ యొక్క ఆదివాసి ప్రాంతంలో నిరక్షరాశులు కావడం వలన అధిక మొత్తంలో ఆధార్ నిర్వహకులు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఇన్ని కష్టాలు పడుతున్న ఆదివాసులు.

ఆధార్ లేకపోవడం వలన గిరిజనులు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమౌతున్నారు. అలాగే ఒక మండలానికి సుమారుగా 20 పంచాయతీలు ఉంటే ఆ యొక్క మండలానికి రెండు లేక మూడు ఆధార్ సెంటర్లు పెట్టడం బాధాకరం. ఈ యొక్క ఆధార్ సెంటర్లో ఏ పంచాయతీలో ఏ గ్రామంలో పెట్టారో కూడా తెలియక పోవడం వలన ఎన్నో ఇక్కట్లు పడుతున్న ఆదివాసి కుటుంబాలు. ఇలాంటి కష్టాలు ఎదురవడం వల్ల ఎంతో మంది గిరిజనులు ఆధార్ కార్డు లేకుండా ఉండడం. ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు నేరుగా చూడడం జరిగింది . ఇక ఆధార్ లేక పొతే మీకు ఉపాధి హామీ పని దొరకదు, రేషన్ కార్డు ఉండదు, చివరికి పిల్లలకు బడిలోకి ప్రవేశం కూడా ఉండదు. మరి ఇలాంటి కష్టాలు ఎప్పుడు తీరుతాయోవేచి చూడాల్సిన పరిస్థితి.

జె. మత్స్య కొండబాబు
మల్లేశ్వరరావు
లక్ష్మణ్
లిబ్‌టెక్ ఇండియా

Our BlogOur Blog
जन वितरण प्रणाली में OTP के कारण राशन कार्डधारी को बहुत बड़े समस्या से जूझ रहे है

by Nanhku Singh/ Jharkhand/ Hindi

This article accounts challenges faced by rightsholder in making changes to ration card in Jharkhand. With the recent introduction of Aadhaar-based OTP login on the RCMS portal has been causing significant inconvenience for many. Read more